Sep 4, 2010

సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు?

సాత్వికుడు, దార్శనికుడు, ఒజ్జలకే ఒజ్జ అయిన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం సెప్టెంబర్ 5 అని మనకు తెలుసు.

వారు భారత రాష్ట్రపతి అయిన సందర్భంగా అతడి పూర్వ విద్యార్థులు దేశము నలుమూలనుండి ఆయన జన్మదిన సందర్భంగా ఆయనను అభినందించడానికి వెళ్ళారు. అతడితో విద్యార్థులు, "మీరు మా జీవితాలను నిర్మించారు. మీకు వేనవేల కృతజ్ఞతలు" అనారు. దానికి అతడు, "నేనే కాదు, యే విద్యార్థి జీవితాన్నైనా నిర్దేశించేది వారి ఉపాధ్యాయుడే. జాతి భవితను నిర్దేశించేది ఉపాధ్యాయుడే. కావున ఈ దినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా, గురు పూజా ఉత్సవంగా జరుపుకోవడంలో ఔచిత్యం ఉంది" అని పేర్కొన్నారు.

అతడి జన్మ దినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపడం గురువులను నిజంగా గౌరవించడమే!

No comments:

Post a Comment