Jun 22, 2010

ఆమె వెళ్ళిపోయిన రోజు

ఆమె వెళ్ళిపోయిన రోజు
నా ముఖాన మసి రాసుకున్నాను.
కౄరమైన పిచ్చిగాలి చెంప పగులగొట్టాను.
ముక్కచెక్కలైన జీవితాన్ని నా చేతికెత్తుకున్నాను.
పగిలిన అద్దం ముందు నగ్నంగా నిలబడ్డాను.
నా మీద నాకే ఆవేశం.
హుందాగా సూర్యుడిని "మూర్ఖుడా!" అని తిట్టాను.
రంగుల లోకపు వైతాళికులను వెతికి వెతికి "థూ!" అన్నాను.
తూర్పునుండి పడమర వైపు చెప్పులు లేకుండా నడిచాను.
దారిలో పడి ఉన్న కంకర రాళ్ళను మీద చల్లుకున్నాను.
సంభ్రమ స్ఫూర్తితో కొండ కోనల్ని చీల్చి
పారే నీటికి యే సముద్రం చేరే కోరికో?
లేదా, మందగతిలో ఇసుక ఒడిలో కూరుకుపోయే ఉద్వేగమో?

నాలో నేను లేనన్నది ప్రశ్న.
ఇక ఆమె కళేభరాన్ని అక్కున చేర్చుకొని
రోధించడం ఎలా?
ఆమె వెళ్ళిపోయిన రోజు
నా ముఖాన మసి రాసుకున్నాను.

మరాఠి మూలం: నామ్ దేవ్ ఢసాళ్
తెలుగు సేత: హరీశ్. జీ.

[ఈ కవిత 06 జూన్ 2010 నాడు "ఆదివారం ఆంధ్రజ్యోతి" లో ప్రచురితమైనది.]

7 comments:

  1. హృద్యంగా ఉంది..

    "ఆమె వెళ్లిపోయిన రోజు" కవిత చదివి కళ్లు చెమ్మగిల్లాయి. ఆమె వెళ్లిపోయిన బాధ చాలా హుందాగా, హృద్యంగా కనిపించింది కవితలో. కౄరమైన పిచ్చిగాలి చెంప పగలగొట్టాను/ ముక్కచెక్కలైన జీవితాన్ని నా చేతికెత్తుకున్నాను/ పగిలిన అద్దం ముందు నగ్నంగా నిలబడ్డాను/ లాంటి వాక్యాలు చాలా బాగున్నాయి. నాలో నేను లేనన్నది ప్రశ్న/ ఇక ఆమె కళేబరాన్ని అక్కున చేర్చుకుని రోదించడం ఎలా?/ అని చెప్పటం గాఢమైన ప్రేమకు నిదర్శనంగా అనిపించింది.

    - కె. రమ, చందుపట్ల, నల్లగొండ.

    [This comment was published in Andhra Jyothi Sunday special edition on 20 th June 2010]

    ReplyDelete
  2. కవిత బాగుందిగాని..ఆమె ఎవరు?

    ReplyDelete
  3. To Jawahar Navodaya Vidyalaya : నాకు అంత సీనుందంటారా !!??

    ReplyDelete
  4. KAVITHA ANUVADAM BAGUNDHI,

    PAGILINA ADDAM MUNDU NAGNANGA NILABADDAVU NE

    MEEDA NEEKE ASSAHYAM VESINDI. AYYYYA ENDUKU?

    ANTHA GHOOOOOOOOORANGA VUNNAVA NEEVU. ANDUKE

    AAME POINDI.

    ReplyDelete
  5. అధిరింది సుపర్బ్ నగ్నంగా ఎందుకు నిలబడినవు

    ReplyDelete
  6. English translation of the poem:

    The Day She Was Gone

    The day she was gone,
    I painted my face black.
    I slapped the savage schizophrenic wind hard in its face.
    I picked up small pieces of my life
    And stood naked in front of a cracked mirror.
    I allowed me to wreak vengeance upon myself.
    I stared condescendingly at the Sun and said, 'You screwball!'
    I showered choice curses upon all artists who paint dreams;
    I walked from the East towards the West;
    I picked stones I found on the way and hurled them at myself,
    How boisterously flows this water in its fit of laughter
    Through mountains and gorges.
    What ocean is it seeking to meet?
    Or will it seep
    Into the soil at sea-level?
    Did even I belong to myself?
    I could not even embrace her dead body
    And cry my heart out.
    The day she was gone,
    I painted my face black.

    ReplyDelete