Oct 7, 2012

కలయిక మరియు ఇంకొన్ని కవితలు


[These poems are published in the August-2012 edition of Saahitya Prasthanam, a literary monthly.]

కలయిక

ఎప్పుడు కలిసి
ఎప్పుడు విడిపోయామో 
తెలియదు.
ఇప్పుడు మళ్ళీ కలిసాము
దాహమున్నంత తృప్తి
తృప్తి ఉన్నంత దాహం
ఇప్పుడు కూడా ఉంది
దాహము తృప్తి కవలపిల్లలు
అంగడములో దాగుడుమూతలు
ఆడుతున్నట్టనిపిస్తుంది.

ఆమె

అందరూ అంటారు 
ఆమె లేదని
నేనంటాను
ఆమె ఉన్నదని
సాక్షి?
నేనే!
ఆమె లేకపోతే
నేను లేకపోయేవాణ్ణి కదా!

కాలమంటే

బ్రతుకు 
రంగులలో
మన రంగును 
కలిపేది

బ్రతుకు

బ్రతుకంటే 
చిత్రమూ కావచ్చు
తలరాత కావచ్చు
మనకిష్టమున్న రంగులతో
రూపొందితే చిత్రం
ఇష్టములేని రంగులతో
యేర్పడితే తలరాత!

ఆ మూడు రోజులు

మనంత మనము
సరదాగ అడుగులు వేసేవారము.
అది గతం.
నేనిప్పుడు ఢిల్లి వదిలి 
మరొక నగరానికి పోతున్నాను.
అక్కడ నాకిష్టమైన ఉద్యోగం దొరికింది
వెళ్ళడానికి ఇంకా మూడు రోజులున్నాయి
నీవన్నావు.....
ఆ మూడు రోజులు 
నాకోసమే!

బైపాస్

మేలుకొన్నవాడికి బ్రతుకు
ప్రతి మలుపులో వేచిఉండి
ఎదురు వస్తుంది!
పడుకొన్నవాడిని బ్రతుకు
మౌనంగా బైపాస్ చేస్తూ
వెళ్ళిపోతుంది!

గజల్

నీవు వెళ్ళిపోతే 
బ్రతుకొక
గజల్ అవుతుంది!
నీవు తిరుగి వస్తే
గజలే
బ్రతుకవుతుంది!

మౌనంగా
మౌనంగా
పూవులా
వికసించాలనిపిస్తుంది
తావిలా....అలా....అలా
గాలిలో
కలసిపోవాలని కూడా.

[పంజాబి కవయిత్రి అమృతా ప్రీతమ్ స్మృతిలో ఆమె చెలికాడు ఇమ్రోజ్ వ్రాసిన ఆత్మకథలాంటి కవితాగుచ్ఛం "అమృతా కే లియే నజ్మ్ జారీ హై" నుండి స్వీకరించిన కవితలివి.]

No comments:

Post a Comment