వీధివీధులలో
రాలిన పూలు
మొసులువారిన సువాసనలు
మేము రోజంతా
ఒక ఉద్యానవనంలో
పూల చట్టుకింద పడుకొన్నాము
పరస్పరం
మౌనంగా మాట్లాడుతూ
వింటూ
అప్పుడప్పుడు చూసుకుంటూ.
రాలుతున్న పూలు
ఒక సారి చేతుల పై
ఇంకొక సారి మెడపై
మరొకసారి పెదవులపై
ముద్దులు పెట్టాయి.
ఆ మాయాసుగంధం
మా ఊపిరిలో
మా కల్పనలో
కలిసింది.
అప్పుడప్పుడు
చెట్టు కూడా పూలతో మాట్లాడినట్లు
అప్పుడప్పుడు
ఆ సువాసనలో తేలిపోతున్నట్లు
అనిపించేది.
ఆ సందర్భానికి తెలియకపోవచ్చుకాని
తరువాత జరిగిన సంఘటనకైతే
తెలిసింది.
ఏదో ఒక రోజు
ఈ మూడు రోజులు
మా జీవితములోని
మూడు కాలాలుగా మారిపోతాయని.
[పంజాబి కవయిత్రి అమృతా ప్రీతమ్ స్మృతిలో ఆమె చెలికాడు ఇమ్రోజ్ వ్రాసిన ఆత్మకథలాంటి కవితాగుచ్ఛం "అమృతా కే లియే నజ్మ్ జారీ హై" నుండి స్వీకరించిన కవిత ఇది.]
No comments:
Post a Comment