Showing posts with label TELUGU POEMS. Show all posts
Showing posts with label TELUGU POEMS. Show all posts

Oct 7, 2012

కలయిక మరియు ఇంకొన్ని కవితలు


[These poems are published in the August-2012 edition of Saahitya Prasthanam, a literary monthly.]

కలయిక

ఎప్పుడు కలిసి
ఎప్పుడు విడిపోయామో 
తెలియదు.
ఇప్పుడు మళ్ళీ కలిసాము
దాహమున్నంత తృప్తి
తృప్తి ఉన్నంత దాహం
ఇప్పుడు కూడా ఉంది
దాహము తృప్తి కవలపిల్లలు
అంగడములో దాగుడుమూతలు
ఆడుతున్నట్టనిపిస్తుంది.

ఆమె

అందరూ అంటారు 
ఆమె లేదని
నేనంటాను
ఆమె ఉన్నదని
సాక్షి?
నేనే!
ఆమె లేకపోతే
నేను లేకపోయేవాణ్ణి కదా!

కాలమంటే

బ్రతుకు 
రంగులలో
మన రంగును 
కలిపేది

బ్రతుకు

బ్రతుకంటే 
చిత్రమూ కావచ్చు
తలరాత కావచ్చు
మనకిష్టమున్న రంగులతో
రూపొందితే చిత్రం
ఇష్టములేని రంగులతో
యేర్పడితే తలరాత!

ఆ మూడు రోజులు

మనంత మనము
సరదాగ అడుగులు వేసేవారము.
అది గతం.
నేనిప్పుడు ఢిల్లి వదిలి 
మరొక నగరానికి పోతున్నాను.
అక్కడ నాకిష్టమైన ఉద్యోగం దొరికింది
వెళ్ళడానికి ఇంకా మూడు రోజులున్నాయి
నీవన్నావు.....
ఆ మూడు రోజులు 
నాకోసమే!

బైపాస్

మేలుకొన్నవాడికి బ్రతుకు
ప్రతి మలుపులో వేచిఉండి
ఎదురు వస్తుంది!
పడుకొన్నవాడిని బ్రతుకు
మౌనంగా బైపాస్ చేస్తూ
వెళ్ళిపోతుంది!

గజల్

నీవు వెళ్ళిపోతే 
బ్రతుకొక
గజల్ అవుతుంది!
నీవు తిరుగి వస్తే
గజలే
బ్రతుకవుతుంది!

మౌనంగా
మౌనంగా
పూవులా
వికసించాలనిపిస్తుంది
తావిలా....అలా....అలా
గాలిలో
కలసిపోవాలని కూడా.

[పంజాబి కవయిత్రి అమృతా ప్రీతమ్ స్మృతిలో ఆమె చెలికాడు ఇమ్రోజ్ వ్రాసిన ఆత్మకథలాంటి కవితాగుచ్ఛం "అమృతా కే లియే నజ్మ్ జారీ హై" నుండి స్వీకరించిన కవితలివి.]

Nov 16, 2010

చివరకు మిగిలేది.....!!!!???

ధన కనక సంచయ సంగ్రామములో
రేయింబవళ్ళు లెక్కించకుండా శ్రమించి, కూడబెట్టి
మోజు మేజవాణీల కాంచన మృగమును వెంబడిస్తూ,
శరీర దారుఢ్యత కోల్పోయి
రుజావ్యాధిగ్రస్తుడై, కృశించి, మంచాన పడి,
కళ్ళు మిటకరిస్తూ, గతించిన ఆరోగ్యమును గూర్చి స్మరిస్తూ,
భార్య పిల్లల ముఖాలు చూసి రోధిస్తూ,
సంపాదించిన సొమ్ము ఆసుపత్రి పాలు అవుతుంటే
చివరకు నీకు మిగిలినదేమిటి?
నలుగురి భుజాలపై ప్రయాణం!
ఎక్కడికని తెలియని శ్మశాన మౌనం!
ఆరడుగుల గోతిలో సుదీర్ఘ శయనం!

- ఓ అజ్ఞాత ఆంగ్ల కవి దర్శనము.
[ఈ కవిత సాహిత్య ప్రస్థానం మాస పత్రిక, నవెంబరు 2010, లో ప్రచురితమైనది]

Aug 20, 2010

ಪ್ರಾರ್ಥನೆ

ಜೀವ ಉಳಿಸುವಷ್ಟು ಉಸಿರನ್ನು ಮಾತ್ರ ಕೊಡು
ಉಸಿರುಗಟ್ಟಿಸುವ ಸುಳಿಗಾಳಿಯಿಂದೆನ್ನ ರಕ್ಷಿಸು;
ಬಾಯಾರಿಕೆ ತೀರುವಷ್ಟು ನೀರನ್ನು ಮಾತ್ರ ಕೊಡು
ಮನುಕುಲವ ಮುಳುಗಿಸುವ ಪ್ರಳಯದಿಂದ ರಕ್ಷಿಸು;
ಹೊಟ್ಟೆಪಾಡಿಗೆ ಬೇಕಾದಷ್ಟು ದುಡ್ಡನ್ನು ಮಾತ್ರ ಕೊಡು
ಆತ್ಮವ ಕೊಲ್ಲುವ ಸಿರಿಸಂಪತ್ತುಗಳಿಂದ ರಕ್ಷಿಸು.

[ತೆಲುಗು ಮೂಲ: ಜಲಾಡಿ ರತ್ನ ಸುಧೀರ್]

ಡಿಮ್ಯಾಂಡ್

ಆಕಾಶದಲ್ಲಿ
ನನ್ನನ್ನು ಆಡಲು ಬಿಡಿ
ಪಾರಿವಾಳದಂತೆ ಹಾರಬೇಕು
ನನ್ನನ್ನು ತಡೆಯಬೇಡಿ.

ತಾರೆಗಳನ್ನು
ಎಣಿಸಲು ಬಿಡಿ
ನನ್ನ ದೇಶದಲ್ಲಿ
ಲಕ್ಷಗಟ್ಟಲೆ ಗುಡಿಸಲುಗಳು
ಕತ್ತಲಲ್ಲಿವೆ -
ಸಾಕಾಗಬಹುದೇನೋ
ಲೆಕ್ಕ ಹಾಕಲು ಬಿಡಿ.

ಬೆಳದಿಂಗಳೆಂದರೆ ನನಗೂ ಇಷ್ಟ
ಚಂದಮಾಮನನ್ನು
ಮುದ್ದಾಡುವಾಸೆ.
ಚಂದ್ರಮಂಡಲ ಉಳ್ಳವರ ಸ್ವತ್ತಾಗಬಾರದು.
ನನ್ನನ್ನೂ ಹೋಗಲು ಬಿಡಿ.

ಸೂರ್ಯನನ್ನು
ನನ್ನ ಮನೆಯೊಳಗೆ
ಮನದೊಳಗೆ
ಮೈಯೊಳಗೆ ಕರೆಯುವೆನು.
ಕ್ರೂರ ಮೃಗಗಳು ಅಡ್ಡನಿಂತಿವೆ
ಆಯುಧಗಳನ್ನು ಕೊಡಿ
ಕೊಚ್ಚಿ ಅವುಗಳನ್ನು
ಸೂರ್ಯನಿಗೆ ಸ್ವಾಗತ ಕೋರುವೆ.

[ತೆಲುಗು ಮೂಲ: ಸಿ. ಹೆಚ್. ಮಧು. ]

Jul 9, 2010

నానీలు

మా బాస్ అరిచాడు
"గో టు హెల్"
నేను సూటిగా ఇంటికి వెళ్ళాను!

*****************

కుక్కలు ఎందుకు
పెళ్ళి చేసుకోవు!?
బతుకుతున్నదే కుక్క బతుకు కదా!?

Jun 22, 2010

ఆమె వెళ్ళిపోయిన రోజు

ఆమె వెళ్ళిపోయిన రోజు
నా ముఖాన మసి రాసుకున్నాను.
కౄరమైన పిచ్చిగాలి చెంప పగులగొట్టాను.
ముక్కచెక్కలైన జీవితాన్ని నా చేతికెత్తుకున్నాను.
పగిలిన అద్దం ముందు నగ్నంగా నిలబడ్డాను.
నా మీద నాకే ఆవేశం.
హుందాగా సూర్యుడిని "మూర్ఖుడా!" అని తిట్టాను.
రంగుల లోకపు వైతాళికులను వెతికి వెతికి "థూ!" అన్నాను.
తూర్పునుండి పడమర వైపు చెప్పులు లేకుండా నడిచాను.
దారిలో పడి ఉన్న కంకర రాళ్ళను మీద చల్లుకున్నాను.
సంభ్రమ స్ఫూర్తితో కొండ కోనల్ని చీల్చి
పారే నీటికి యే సముద్రం చేరే కోరికో?
లేదా, మందగతిలో ఇసుక ఒడిలో కూరుకుపోయే ఉద్వేగమో?

నాలో నేను లేనన్నది ప్రశ్న.
ఇక ఆమె కళేభరాన్ని అక్కున చేర్చుకొని
రోధించడం ఎలా?
ఆమె వెళ్ళిపోయిన రోజు
నా ముఖాన మసి రాసుకున్నాను.

మరాఠి మూలం: నామ్ దేవ్ ఢసాళ్
తెలుగు సేత: హరీశ్. జీ.

[ఈ కవిత 06 జూన్ 2010 నాడు "ఆదివారం ఆంధ్రజ్యోతి" లో ప్రచురితమైనది.]

Apr 7, 2010

నానీలు

సూర్యుడు
దిగంబరుడయ్యాడు!
మేము
వస్త్రాలు ధరించాము!

******

తడి ఆరితే
నేల అయినా
ఎద అయినా
ఎడారే!

[Inspired by Soofi Folk Literature]

Aug 10, 2009

అమ్మకానికున్నాయి !

అమ్మకానికున్నాయి !
సగం గీసిన చిత్రం
సగం కట్టిన ఇల్లు
సగం కన్న కల
ఎవరైనా కొనవచ్చు!
అమ్మకానికున్నాయి !
సగం వ్రాసిన డైరి
సగం మనసు
సగం వయసు

అచ్చమైన తెల్ల కాగితంపై
ఎపుడో గీసిన రంగుల చిత్రం
అక్కడక్కడ మాసిపోయింది
కొంచెం మురికి పట్టింది
కొంచెం మరక పడింది
చెదలు తినగా మిగిలిన సగం చిత్రం
అమ్మకానికుంది!
కళ తెలిసినవారు కొనవచ్చు!
లేదంటే వదిలి వేయవచ్చు

పైకప్పులేని ఒంటరి ఇంట్లో
వెల్లికిలా పడుకొని
అందమైన రేపటి కోసం
నిరీక్షిస్తూ కన్నటి సగం కల
అమ్మకానికుంది !
"కల"కారులుంటే కొనవచ్చు
నచ్చకపోతే మరిచిపోవచ్చు

ఎవరి దినచర్యనో నాదనుకొని
అదే మైకములో రేయింబవళ్ళు గడిపి
మూలుగుతూ....దొర్లుతూ.....
నన్ను నేనే వెతుకుతూ....
నేను వ్రాసిన, నేను లేని
సగం డైరీ పుటలు
అమ్మకానికున్నాయి !
రచయితలుంటే కొనవచ్చు
వద్దనుకుంటే కాల్చవచ్చు

విషయాసక్తిలో కరిగిపోయింది
సగం వయసు
మత్తిలిన దారులలో కోల్పోయింది
సగం మనసు
మనసులేని మనసులో
వయసు కాని వయసులో
అమ్ముకుంటున్నాను - నన్ను నేను
ప్రేమ ఉంటే కొనవచ్చు
నీతి తప్పాననిపిస్తే చంపవచ్చు !

కన్నడ మూలం : హెచ్. ఎస్. బొళ్మాడి.

[This poem is published with the same title in "Saahiti prasthanam" of November 2009 edition. Page no. 11]

Jul 26, 2008

..............రిస్క్ తీసుకొను!


పెగ్ - ౧

మందు తాగేటప్పుడు నేను ఎటువంటి రిస్క్ తీసుకొను!
సాయంత్రము ఇంటికి చేరే వేళకు నా భార్య వంట చేస్తుంటుంది!
షెల్ఫ్ పైన శబ్దము వినిపిస్తుంటుంది.
నేను శబ్దము చేయకుండా మెల్లగా ఇంట్లోకి వస్తాను!
నా నల్ల బీరువా నుండి బాటిల్ తీస్తాను!
గాంధీజీ ఫోటో లోపలి నుండే నవ్వుతుంటాడు!
ఈ చెవి మాట ఆ చెవికి వినపడదు.
ఎందుకంటే నేను రిస్క్ తీసుకొను!
వాడకుండా వదిలి పెట్టిన
బాత్ రూమ్ గూటిలో నున్న గ్లాసు తీసుకుంటాను!
దానిలొ ఒక పెగ్ పొసి ఆస్వాదిస్తాను!
గ్లాసును కడిగి మళ్ళీ గూటిలో పెడతాను!
అఫ్‍కోర్స్! బాటల్‍ను కడిగి మళ్ళీ గూటిలో పెడతాను!
గాంధీజీ ముసిముసిగా నవ్వుతుంటాడు!
వంటింతికి పోయి చూస్తాను కదా,
నా భార్య పిండి కలుపుతుంటుంది!
ఈ చెవి మాట ఆ చెవికి వినపడదు!
నేను: రెడ్డి కూతురికి పెళ్ళి సంబంధము కుదిరిందా?
ఆమె: ఆయన సరైన వాడైతే కదా, ఏదైనా మంచి సంబంధము కుదరడానికి?
పెగ్ - ౨

నేను మళ్ళి బయటికి వస్తాను
నల్ల బీరువానుండి పిలుస్తూ, శబ్దము వస్తుంది.
మిగిలిన బాటల్‍ను శబ్దము లేకుండా తీస్తాను!
ఒక పెగ్ పోసుకొని మళ్ళి ఆస్వాదిస్తాను!
బాటల్‍ను కడిగి బాత్రూమ్‍లో పెడతాను!
నల్ల గ్లాసును బీరువాలో పెడతాను!
ఈ చెవి మాట ఆ చెవికి వినబడదు!
ఎందుకంటే నేను రిస్క్ తీసుకోను!
నేను: బై ది బై, రెడ్డిగారి కూతురికి పెళ్ళీడు వచ్చిందా?
ఆమె: రాక పోవడము ఏంటి? రెండు గాడిదల వయసొచ్చింది!
నేను: (నోటి దాకా వచ్చిన మాటను ఆపుకుంటూ.....) ఔనా?

పెగ్ - ౩

నేను మళ్ళీ నల్ల బీరువానుండి పిండిని తీస్తాను!బీరువా స్వస్థలము మారుతుంది!
గూటినుండి బాటిల్ తీసి, బాత్రూమ్‍లో ఒక పెగ్ వేస్తాను!
గాంధీజీ చాలా గట్టిగా నవ్వుతుంటాడు!
గూటిని పిండిలో పెట్టి,
గాంధీజీ ఫొటోను కడిగి బీరువాలో పెడతాను!
నా భార్య గ్యాస్ మీద బాత్రూమ్ పెడుతుంది!
ఈ బాటిల్ మాట ఆ బాటిల్‍కు వినబడదు!
ఎందుకంటే నేను రిస్క్ తీసుకోను!
నేను: (కోపముతో) రెడ్డిగారిని గాడిద అంటావా?
ఇంకోసారి అలా అంటే నీనాలుక చెరేస్తా!
ఆమె: ఊరికే ఏదేదో వాగకు! బయట పడుండు పో!

పెగ్ - ౪
నేను పిండినుండి బాటిల్ తీస్తాను!
నల్ల బీరువాలోకి పోయి ఒక పెగ్ గుటుక వేస్తాను!
బాత్రూమ్‍ను కడిగి గూటిలో పెడతాను!
నా భార్య నన్ను చూసి నవ్వుతుంటుంది!
గాంధీజీ వంట చేస్తూనే ఉంటాడు!
ఈ రెడ్డి మాట ఆ రెడ్డికి వినబడదు!
ఎందుకంటే నేను రిస్క్ తీసుకోను!
నేను: (నవ్వుతూ) ఏంటీ, రెడ్డి గాడిదను పెళ్ళిచేసుకున్నాడా?
ఆమె: (అరుస్తూ) నీ తలపై నీళ్ళు పోస్తానిపుడు!
నేను మళ్ళీ వంటింట్లోకి పోతాను!
ఊరికే గూటిలో కూర్చుంటాను!
గ్లాస్ కూడా గూటిలో ఉంటుంది!
బయట గదినుండి బాటళ్ళ శబ్దము వినిపిస్తుంటుంది!
నేను వెళ్ళి చూస్తాను!
బాత్రూమ్‍లో నా భార్య ఒక పెగ్ ఆస్వాదిస్తుంటుంది!
ఈ గాడిద మాట ఆ గాడిదకు పడదు!
ఎందుంకంటే గాంధీజీ దేనికి రిస్క్ తీసుకోడు!
అంత వరకు రెడ్డి వంట చేస్తూనే ఉంటాడు!
నేను నా ఫోటోనుండి,
నా భార్యను చూసి నవ్వుతుంటాను!
ఎందుకంటే...................
నేను దేనికీ రిస్క్ తీసుకోను!

[మూలం : అజ్ఞాత మరాఠీ కవి దర్శనము]