Feb 22, 2010

To be or not to be

ఒఫీలియాను
హ్యామ్లెట్ అడిగాడు;
నీ రేఖా చిత్రం
గీస్తాను,
ఏ పెన్సిల్ వాడాలి?
2B or not 2B ??

[ఆంగ్ల మూలం: స్పైక్ మిలిగన్]

!!!!!!!!!!!!!!..............???????

వాళ్ళు నూరడుగుల ఎత్తైన
చెట్టును నరికారు!
కుర్చీలను చేశారు!
నేనొక కుర్చీని
కొని తెచ్చాను!
ఆరడుగుల ఎత్తున్న నేను
కుర్చీలో కూర్చోగానే
అయ్యింది
మూడడుగులే!
నన్ను మూడడుగుల
వామనుడిని చేయడానికి
నూరడుగుల చెట్టును
నరకాలా????

[ఆంగ్ల మూలము: స్పైక్ మిలిగన్]