Nov 16, 2010

చివరకు మిగిలేది.....!!!!???

ధన కనక సంచయ సంగ్రామములో
రేయింబవళ్ళు లెక్కించకుండా శ్రమించి, కూడబెట్టి
మోజు మేజవాణీల కాంచన మృగమును వెంబడిస్తూ,
శరీర దారుఢ్యత కోల్పోయి
రుజావ్యాధిగ్రస్తుడై, కృశించి, మంచాన పడి,
కళ్ళు మిటకరిస్తూ, గతించిన ఆరోగ్యమును గూర్చి స్మరిస్తూ,
భార్య పిల్లల ముఖాలు చూసి రోధిస్తూ,
సంపాదించిన సొమ్ము ఆసుపత్రి పాలు అవుతుంటే
చివరకు నీకు మిగిలినదేమిటి?
నలుగురి భుజాలపై ప్రయాణం!
ఎక్కడికని తెలియని శ్మశాన మౌనం!
ఆరడుగుల గోతిలో సుదీర్ఘ శయనం!

- ఓ అజ్ఞాత ఆంగ్ల కవి దర్శనము.
[ఈ కవిత సాహిత్య ప్రస్థానం మాస పత్రిక, నవెంబరు 2010, లో ప్రచురితమైనది]